Site icon HashtagU Telugu

తొలి సెమిస్ట‌ర్ ప‌రీక్ష ఉత్తుత్తుదే.. ట్విట్ట‌ర్ పోస్ట్ ఫేక్

ప‌దో త‌ర‌గ‌తి, ప‌న్నెండో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై గ‌త కొద్ది రోజులు తిక‌మ‌క కొన‌సాగుతోంది. ఈసారి సెమిస్ట‌ర్ ప్ర‌కారం ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఆ క్ర‌మంలో న‌వంబ‌ర్ లో మొద‌టి సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుతాయ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఒక పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

విద్యార్థులు చాలా మంది ట్విట్ట‌ర్ పోస్ట్ ను గ‌మ‌నించారు. న‌వంబ‌ర్లో మొద‌టి సెమిస్ట‌ర్ ప‌రీక్ష ఉంటుంద‌ని భావిస్తున్నారు. కొంద‌రు మెయిల్స్ రూపంలో వివ‌రాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంకొంద‌రు ఎన్ సీఆర్ టీ, సీబీఎస్ఈ బోర్డుల ద్వారా తెలుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. పైగా ఆ పోస్ట్ లు తేదీ. లేక‌పోవ‌డం, కేవ‌లం నెల మాత్ర‌మే తెలియ‌చేయ‌డం మ‌రింత తిక‌మ‌క క‌లిగిస్తోంది.

ట్విట్ట‌ర్ పోస్ట్ లోని మెసేజ్ ను గ‌మ‌నించిన పీఐబీ దానిలో వాస్త‌వాల‌ను వెతికింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. ఆ పోస్ట్ లోని వివ‌రాల త‌ప్పు అని తేల్చేసింది. న‌వంబ‌ర్లో మొద‌టి సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు ప‌ది, ప‌న్నెండో త‌ర‌గ‌తి ఉంటాయ‌ని బోర్డు వెల్ల‌డించలేద‌ని నిర్థారించింది. సో..ట్విట్ట‌ర్లో వైర‌ల్ అవుతోన్న ఆ పోస్ట్ ఫేక్.