Site icon HashtagU Telugu

NSE కేసులో చిత్రా రామకృష్ణ సీబీఐ అరెస్టు చేసే అవ‌కాశం..?

Ap Cbi

Ap Cbi

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) మాజీ చీఫ్, చిత్రా రామకృష్ణ ను సీబీఐ అరెస్ట్ చేసేఅవ‌క‌శాం ఉంది. ఢిల్లీ కోర్టు శనివారం ఆమె ముందస్తు బెయిల్‌ను కొట్టివేసిన తర్వాత, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసే అవకాశం ఉందని సీబీఐ వ‌ర్గాలు తెలిపాయి. సీబీఐ అరెస్టు నుంచి తమకు రక్షణ కల్పించాలని చిత్రా రామకృష్ణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిష‌న్ ను సీబీఐ వ్యతిరేకించడంతో కోర్టు బెయిల్ పిటిష‌న్ ను తిర‌స్క‌రించింది. అధికారులు ఆమెను త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని, అయితే ఆమె హైకోర్టును ఆశ్రయిస్తే, సీబీఐ ఆర్డర్ కోసం వేచి ఉండాల్సి ఉంటుందని స‌మాచారం. NSE యొక్క మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చిత్రా రామకృష్ణ, NSE గురించి రహస్య సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలపై విచారణలో ఉన్నారు. గతంలో ముంబైలో సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఆమె సన్నిహితుడు, ఎన్‌ఎస్‌ఈ మాజీ గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్రమణ్యమ్‌ను గతంలో సీబీఐ అరెస్టు చేసింది

Exit mobile version