Site icon HashtagU Telugu

Jet Airways: జెట్ ఎయిర్‌వేస్ పై సీబీఐ దాడులు.. కేసు నమోదు?

Jet Airways

Jet Airways

కెనరా బ్యాంకు ను రూ.538 కోట్ల మేర మోసగించినందుకు జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా సీబీఐ అతని కార్యాలయం ఇంట్లో సోదాలు నిర్వహించింది. నరేష్ తో పాటుఇంకా కొంతమందిపై సిబిఐ కేసు నమోదు చేసింది. కాగా నరేష్ కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసగించినందుకు గోయల్ తదితరుల పై సీబీఐ కేసు నమోదు చేసింది. గోయల్, ఆయన భార్య అనిత, విమానయాన సంస్థ మాజీ డైరెక్టర్ గౌరంగ్ ఆనంద్ శెట్టి నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ తాజాగా సోదాలు చేసింది.

ఈ క్రమంలోనే జెట్‌ ఎయిర్‌వేస్‌ నరేష్ గోయల్‌, ఎయిర్‌ లైన్స్‌ మాజీ అధికారులతో సహా ఢిల్లీ, ముంబైలోని దాదాపు ఏడు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి అని సీబీఐ తెలిపింది. కాగా ఒకప్పుడు ఇండియాలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్‌ వేస్ తీవ్రమైన నగదు కొరత, అప్పుల భారంతో ఏప్రిల్ 2019లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. సుదీర్ఘ దివాలా ప్రక్రియ తర్వాత జూన్ 2021లో దీనిని ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేయబడింది.

Exit mobile version