Hyderabad: హైదరాబాద్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేసే ఇద్దరు అధికారులకు సిబిఐ కఠిన నిర్ణయం తీసుకుంది. సదరు వ్యక్తులు మోసానికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దోషులు పిల్లెండ్ల ఫణి ప్రసాద్ (బ్రాంచ్ మేనేజర్), చింతకుంట్ల పాండురంగం చలపతి (అసిస్టెంట్ మేనేజర్) ఇద్దరికీ ఒక్కొక్కరికి రూ.75,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
ప్రసాద్, చలపతిలపై 2005 నవంబర్ 30న సీబీఐ కేసు నమోదు చేసింది. ఇద్దరూ హైదరాబాద్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆసిఫ్ నగర్ బ్రాంచ్‌లో పనిచేశారు. ఈ కేసులో మరో నిందితుడు యర్రం కోటేశ్వరరావు, ఓ ప్రైవేట్ కంపెనీ యజమాని. విచారణ అనంతరం మే 18, 2007న ముగ్గురిపై చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ సమయంలో వై కోటేశ్వరరావు మృతి చెందారు. మరో ఇద్దరిని దోషులుగా నిర్ధారించిన కోర్టు వారికి శిక్ష విధించింది.
గృహాల నిర్మాణానికి 23 గ్రూప్ హౌసింగ్ లోన్‌లను మంజూరు చేశారు. రుణగ్రహీతలకు సరైన గుర్తింపు లేకుండా నకిలీ పత్రాలను ఉపయోగించి రూ.1.15 కోట్లు చెల్లించారు.
Read More: Minister Amit shah: బండి సంజయ్‌కు అమిత్ షా ఫోన్.. ఆ విషయంపై స్పష్టమైన హామీ ఇచ్చిన షా..