Site icon HashtagU Telugu

CBI Raids: కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ఇంట్లో సీబీఐ సోదాలు..!!

Chidambaram

Chidambaram

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. కార్తీ చిదంబరం నివాసాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన కార్యాలయాల్లో సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం నుంచే సోదాలు ప్రారంభించారు. కార్తీ చిదంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగైల్లోని ఏడు ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు నగదు బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి.

ఈ మేరకు ఈ మధ్యే కార్తీ చిదంబరం సీబీఐ కేసును కూడా నమోదు చేసింది. సీబీఐ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.