Delhi Excise Scam : ఢిల్లీ లిక్క‌ర్ కేసులో సంచ‌ల‌నం.. ఎమ్మెల్సీ క‌విత ఆడిట‌ర్ అరెస్ట్‌

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మ‌ద్యం పాల‌సీ స్కామ్‌లో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో

  • Written By:
  • Updated On - February 8, 2023 / 09:59 AM IST

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మ‌ద్యం పాల‌సీ స్కామ్‌లో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆడిటర్‌గా ప‌ని చేస్తున్న బుచ్చిబాబుని విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీకి పిలిపించింది. అతను సహకరించనందున మంగళవారం సాయంత్రం అతన్ని అరెస్టు చేసినట్లు స‌మాచారం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో సీఏ బుచ్చిబాబు పాత్రపై సీబీఐ విచారించింది. విచార‌ణ‌లో స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో బుచ్చిబాబుని అరెస్ట్ చేశారు. ఆయనను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె ఎమ్మెల్సీ క‌వితను గతేడాది డిసెంబర్‌లో సీబీఐ ప్రశ్నించింది.