Site icon HashtagU Telugu

Caught On Video: ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఇలా!

Fire

Fire

ఇటీవల జరిగిన సికింద్రాబాద్‌లోని బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదంలో 11 మంది వలస కూలీలు చనిపోవడం ప్రతిఒక్కరినీ కలిచివేసింది. అయితే మంటలు చెలరేగినప్పుడు, అందులో నిద్రిస్తున్న 12 మంది కార్మికులలో ప్రేమ్ ఒకడు. మంటలు వ్యాపించేలోపు అతను ఒక్కడే మొదటి అంతస్తు నుంచి దూకగలిగాడు. ప్రేమ్ తప్పించుకున్న వెంటనే మంటలు గోడౌన్‌కు వ్యాపించాయి. దీంతో అంతస్తులో చిక్కుకున్న 11 మంది వ్యక్తులు కాలిపోయారు. ఆ రాత్రి CCTV వీడియో ఇప్పుడు బయటపడింది. ప్రేమ్ మొదటి అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్ పైన ఉన్న స్లాబ్‌పైకి దూకి వీధిలోకి నడిచి వెళ్తున్నట్టు చూడొచ్చు. మంటలు తీవ్రతరం కాకముందే, అక్కడే ఉన్న మరో వ్యక్తితో కలిసి దూరంగా వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Exit mobile version