Site icon HashtagU Telugu

Caught On Camera: ఎయిర్ షో లో విషాదం.. ట్రక్ డ్రైవర్ మృతి!

Jet Accident

Jet Accident

యునైటెడ్ స్టేట్స్‌లో ఎయిర్ షోలో జెట్-ఇంధన సెమీ ట్రక్ పేలడంతో 40 ఏళ్ల వ్యక్తి  మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమంది ఎయిర్ షోకు అటెండ్ అయ్యారు. వివిధ రకాల విన్యాసాలు చేస్తూ సంతోషంలో మునిగిపోయారు. అయితే ఎయిర్ షోలో భాగంగా ఓ జెట్ గాల్లోకి లేచింది. రెండు విమానాలను రేసింగ్ చేస్తున్నప్పుడు షాక్‌వేవ్ జెట్ ట్రక్ అనే అతని వాహనం క్రాష్ అయింది. రెండు విమానాలు ఏరియల్ ట్రిక్స్ చేయడంతో ఇందన ట్రక్ పేలడంతో  అతను చనిపోయాడు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ట్రక్కు డ్రైవర్ ఈ ప్రమాదంలో చనిపోయాడు. చాలా సంవత్సరాలుగా ఎయిర్ షో వ్యాపారంలో భాగమైన కుటుంబ సభ్యుడు క్రిస్ డార్నెల్ ఈ సంఘటనలో మరణించాడని తెలిపింది.