హైదరాబాద్: హైదరాబాద్‌లోని జీయర్ స్వామి ధ్యాన్ ఫౌండేషన్ (జేఎస్‌డీఎఫ్) గౌశాలలో సోమవారం అర్ధరాత్రి ఆవులను ఎత్తుకెళ్లారు. గో మాఫియా గూండాలు చొరబడి ఆస్తి కేసులో ఇరుక్కున్న 25 ఆవులను అపహరించారు. ముఠా సభ్యులు ఆవులను ఆపహరించే ముందు గోశాల వెలుపల క్రాకర్లు పేల్చి లోపలికి చొరబడ్డారు. దీనిపై జీయర్ స్వామి ధ్యాన్ ఫౌండేషన్ సభ్యులు శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎద్దులను దొంగిలించి, జేఎస్‌డీఎఫ్ ఆస్తులను ధ్వంసం చేసిన ముఠా సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
షెల్టర్ వెలుపల ఒక గుంపు నిలబడి అరుస్తూ ఈ ముఠా గందరగోళం సృష్టించిందని.. ఫౌండేషన్ సభ్యుడు, ఫిర్యాదుదారు హరీష్ కాకర్ల తెలిపారు . వారు ట్రక్కులతో వచ్చి కొన్ని ఎద్దులను అప్పగించాలని సిబ్బందిని బలవంతం చేశారని తెలిపారు.గోవులను ఇవ్వకుంటే రాత్రికి మళ్లీ వచ్చి గోడలు పగలకొట్టి తీసుకువెళ్తామని ముఠా సభ్యులు బెదిరించారని ఆయన పేర్కొన్నారు. ఈ ముఠాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Pic- File Photo
