KTR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. బాల్మూరి వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘‘కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రెచ్చగొట్టేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. సీఎం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆయన పరువు దెబ్బతీసేలా బహిరంగంగా ఆరోపణలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి’’ అని పేర్కొన్నారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ ప్రతిష్ఠను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపించారు.
Fee-Hike : ఇంజినీరింగ్ కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి కొరడా
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకాలపై మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణ కమిషన్ ప్రశ్నిస్తున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఇదే విషయాన్ని బాల్మూరి వెంకట్ పోలీసులు దృష్టికి తీసుకువెళ్లారు. ‘‘ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది చట్టపరంగా అనుమతించదగ్గది కాదు’’ అని ఆయన కంప్లైంట్‌లో పేర్కొన్నారు. పూర్తిగా ఫిర్యాదును పరిశీలించిన తర్వాత, సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలకు దిగారు. అందులో భాగంగా భారతీయ శిక్షాసమితి (భారతీయ న్యాయ వ్యవస్థ – BNS)లోని సెక్షన్ 353(2), సెక్షన్ 352 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లు ప్రజాసేవలో ఉన్న అధికారులపై ఉద్దేశపూర్వకంగా ఆవేదన కలిగించే చర్యలు, అనుచిత ప్రవర్తనలకు సంబంధించినవిగా పేర్కొనబడినవి.