Site icon HashtagU Telugu

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై క్రిమిన‌ల్ కేసు.. న‌మోదైన సెక్ష‌న్లు ఇవే!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసు జూన్ 22న మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొన్న సందర్భంలో నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు న‌మోదైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే ఈ కేసు వివరాలు ఇంకా పూర్తిగా స్పష్టంగా తెలియరాలేదు.

జూన్ 22న మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సు (మురుగన్ భక్తర్గల్ ఆన్మీగ మానాడు)లో మద్రాస్ హైకోర్టు నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై న‌మోదైంది. అడ్వకేట్ ఎస్. వాంజినాథన్, మధురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ త‌మ ఫిర్యాదులో ఈ విధంగా పేర్కొన్నారు. సదస్సులో పవన్ కళ్యాణ్, మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై, హిందూ మున్నానీ నిర్వాహకులు రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలతో సామాజిక విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు, తీర్మానాలు చేశారని ఫిర్యాదు చేశారు.

Also Read: Xiaomi Ev cars : షియోమీ ఈవీ కార్స్ సంచలన రికార్డు.. ఒక గంటలోనే 3 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్!

ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 196(1)(a) (మతం ఆధారంగా విద్వేషం రెచ్చగొట్టడం), 299 (మతపరమైన భావనలను అవమానించడం), 302 (సామాజిక సామరస్యాన్ని భంగపరిచే చర్యలు), మరియు 353(1)(b)(2) (ప్రజా శాంతిని భంగపరిచే ప్రసంగాలు) కింద అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేశారు. మ‌ధురై పీపుల్స్ సోషల్ హార్మోనీ ఫెడరేషన్ పవన్ కళ్యాణ్, అన్నామలై, ఇతర నిర్వాహకులపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలు సామాజిక సామరస్యాన్ని, జాతీయ ఐక్యతను దెబ్బతీస్తాయని పేర్కొంది.