Site icon HashtagU Telugu

Hyderabad : ఎన్నారైని మోసం చేసిన అంబ‌ర్‌పేట ఎస్ఐ.. కేసు న‌మోదు

Crime

Crime

ఎన్నారైని మోసం చేసిన కేసులో ఓ ఎస్ఐపై కేసు న‌మోదు అయింది. అంబర్‌పేట్ ఇన్‌స్పెక్టర్‌పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఎన్నారైని రూ.54 లక్షలు మోసం చేశాడని కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ సుధాకర్, సస్పెండ్ అయిన పోలీసుతో కలిసి తహశీల్దార్ తమకు వ్యక్తిగతంగా తెలుసునని చెప్పి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ఎన్‌ఆర్‌ఐ నుంచి ఆ మొత్తాన్ని తీసుకున్నారని బాధితుడు ఆరోపించారు. డ‌బ్బులు ఇచ్చిన‌ప్ప‌టికీ బాధితుడి స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ నుంచి డబ్బులు వెనక్కి తీసుకునేందుకు బాధితుడు ప్ర‌య‌త్నించాడు. డ‌బ్బులు వెన‌క్కి ఇవ్వ‌క‌పోవ‌డంతో బాధితుడు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 420, 406, 467 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version