Nagarkurnool: ఆసుప‌త్రికి వ‌చ్చిన బాలిక‌పై లైగింక దాడి..యువ‌కుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

నాగర్‌కర్నూల్ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మైనర్ బాలికపై లైంగిక దాడి జ‌రిగింది.

Published By: HashtagU Telugu Desk
Singapore

Crime

నాగర్‌కర్నూల్ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మైనర్ బాలికపై లైంగిక దాడి జ‌రిగింది. దాడికి యత్నించిన 21 ఏళ్ల యువకుడిపై దిశ, నిర్భయ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరజ్‌గా గుర్తించారు. తెల్లవారుజామున 3 గంటల స‌మ‌యంలో బాలికపై లైంగిక దాడి జ‌రిగింది. బాలిక అప్రమ‌త్త‌మై బంధువుల‌కు తెలిపింది.

వెంట‌నే వారు పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని నీరజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ హనుమంతు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దిశ, నిర్భయ, పోక్సో కింద కేసు నమోదు చేశారు. నీరజ్ ఆసుపత్రికి వచ్చి పెయింటర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

  Last Updated: 11 Jun 2022, 01:42 PM IST