Site icon HashtagU Telugu

Care Hospitals: 80 ఏళ్ల రోగికి అరుదైన వెన్నముక శస్త్ర చికిత్స.. చివరికి?

Care Hospitals

Care Hospitals

తాజాగా హైదరాబాదులోని మలక్పేట్ లో కేర్ హాస్పిటల్ లో 80 ఏళ్ళ వృద్ధ మహిళక వెర్టెబ్రా స్టెంట్రోప్లాస్టి అనే అరుదైన సంక్లిష్టమైన వెన్నెముక ప్రక్రియను నిర్వహించారు. హైదరాబాదులోని మలక్పేట్ లో ఉన్న కేర్ హాస్పిటల్ లోని సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ కె.వి శివానందరెడ్డి అలాగే అతని బృందం విజయవంతంగా నిర్వహించిన తగ్గించి తక్కువ సమయంలో చలనశీలతను పరిద్ధరించడం ద్వారా వెన్నెముక పగుళ్ల చికిత్సలో విప్లవాత్మక మార్పులు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే 80 ఏళ్ల శ్రీమతి చిదమ్మ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతూ కేర్ హాస్పిటల్ లోని వైద్యులను సంప్రదించింది.

ఆమె గతంలో ఒక నెల క్రితం మరొక ఆసుపత్రిలో వెన్నెముక ఫ్యాక్చర్ ఆపరేషన్ చేయించుకుంది. అయినప్పటికీ ఆమె ఆ లక్షణాల నుంచి ఉపశమనం పొందలేదు. ఇక కేర్ హాస్పిటల్ వైద్యులు ఆమెను పరీక్షించిన తర్వాత ఆమె ఇదివరకే చేయించుకున్న శస్త్ర చికిత్స సమయంలో ఉంచిన స్క్రూలు సరిగ్గా ఉంచబడలేదు అలాగే వెన్నెముక కాలువను ఆక్రమిస్తున్నట్లు వైద్యులు కనుగొన్నారు. అయితే రోగి పరిస్థితి వయస్సు అలాగే కొమొర్బీడిటీల ఆధారంగా స్క్రూలు తొలగించి కనిష్టంగా ఇన్వాసివ్ వెరెబ్రా స్టెంటో ప్లాస్టిని నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

సర్జరీ సమయంలో వెన్నుపూస శరీర ఎత్తును పునరుద్ధరించడానికి ద్వైపాక్షిక బుడగలు ఉపయోగించబడ్డాయి. ఆ తరువాత అది సిమెంట్ తో పెంచబడింది. ఆమె ఎటువంటి సపోర్ట్ లేకుండా కూర్చునే సామర్థ్యాన్ని కూడా తిరిగి పొందింది. అంతేకాకుండా చాలా తక్కువ సమయంలోనే ఆమె జీవన నాణ్యత లో గణనీయమైన మెరుగుదలను చూపించారు. ఈ విషయంపై స్పందించిన డాక్టర్ శివానందరెడ్డి చిదమ్మకు ఇంత సానుకూలమైన ఫలితాన్ని సాధించడం పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. 80 ఏళ్ల మహిళ రోగిలో ఇటువంటి ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయడం అన్నది వైద్య బృందం యొక్క నైపుణ్యం నిబద్ధతను హైలైట్ చేస్తుందని ఆయన తెలిపారు