Car Life: మూడేళ్లుగా కారులోనే నివసిస్తున్న మహిళ.. కారణం అదే!

సాధారణంగా మనం జీవనం సాగించాలి అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, అలాగే నివసించడానికి ఒక ఇల్లు

  • Written By:
  • Publish Date - August 5, 2022 / 04:00 PM IST

సాధారణంగా మనం జీవనం సాగించాలి అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, అలాగే నివసించడానికి ఒక ఇల్లు ఉండాలీ. కానీ ఒక మహిళ మాత్రం ఇక మూడేళ్ల నుంచి కారులోనే నివసిస్తుంది. మరి ఆ మహిళ ఎవరు?ఆమె ఎక్కడ ఉంటుంది? ఎందుకు ఆమె కారులో నివసిస్తోంది అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆమె పేరు నికిత క్రంప్. ఈమె 2019 నుండి హోండా సివిక్ కారులోనే జీవిస్తోంది. అయితే ఆమె ఈ కారులో జీవించేందుకు కావాల్సిన ఎలాంటి సదుపాయాలూ లేవు. సాధారణంగా కార్లు, వ్యాన్ లలో జీవించేవారు ఇలాంటి అన్ని సదుపాయాలూ కల్పించుకుంటారు. కానీ ఆమె మాత్రం ఎటువంటి లేకపోయినా దాదాపు మూడేళ్లుగా హాయిగా కారులో జీవిస్తోంది.

ఈమెకు ఇన్‌స్టాగ్రామ్ లో 1.21 లక్షల మంది ఫాలోయర్స్ ఉండగా టిక్ టాక్ లో ఏకంగా 10 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ప్రతి రోజూ తన డైలీ లైఫ్ కు సంబందించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె షేర్ చేసిన వీడియోలపై అభిమానులు కొంతమంది కామెంట్స్ చేయగా మరి కొంతమంది డౌట్లు అడుగుతూ ఉంటారు. ఆమె కూడా ఎంతో ఓపికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటుంది. ఒకప్పుడు నికిత ఇంట్లో అద్దెకు ఉండేటప్పుడు అద్దె చెల్లించేందుకు భోజనం ఎగ్గొట్టాల్సి వచ్చేది. ఇలా కాలే కడుపుతో గడపాల్సి వచ్చేది. ఇదే విషయం పై ఆమె విసిగిపోయింది.విదేశాల్లో రకరకాల ఖర్చులు ఎక్కువ. వచ్చే డబ్బు బిల్లులకు సరిపోదు. నికిత రెండు రకాల ఉద్యోగాలు చేసేది. అయినా అప్పుల్లో కూరుకుపోయింది.

Car Life

దాంతో అప్పుడు ఆమె కారులో జీవిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. ఒకవైపు ఇంట్లో అద్దెకు ఉంటూనే కొన్ని రోజులు కారులో జీవించింది. ఈ ప్రయోగంలో ఎదురయ్యే సమస్యల్ని గుర్తించి,వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ వేసుకొని, అంతా ఓకే అనుకున్నాక ఇంటికి గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం నికిత అమెరికా అంతటా కారులో తిరుగుతూ రోజూ పడుకోవడానికి గూగుల్ స్ట్రీట్ వ్యూని ఉపయోగిస్తోంది. అందులో చూసి రాత్రిళ్లు పడుకోవడానికి వీలయ్యే ప్రదేశాన్ని వెతుక్కుంటుంది. అంతే కాకుండా ఆమె నిద్రపోయే ఏరియాలో స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉండేలా చూసుకుంటుదట. అక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఉన్న చోటును ఎంచుకొని అక్కడికి వెళ్ళి,రాత్రిళ్లు కారులో నిద్రపోతూ కారు లోపలికి ఎవరూ చూసే ఛాన్స్ లేకుండా విండోలను కవర్లతో మూసివేస్తోంది. ఆ విండో కవర్లను తనే స్వయంగా తయారుచేసుకుంది. అందువల్ల వాటి వల్ల లోపల ఆమె ఉన్నట్లు ఎవరికీ తెలియదు. అలాగే ఆమెరికాలో ఇలాంటి ఉచిత ఇళ్లు కూడా ఉంటాయి. వాటిలో ఓనర్లు నివసించరు. అటువంటి ఇళ్లలో కూడా అప్పుడప్పుడు నివసిస్తూ ఉంటుంది నికిత. ప్రతిరోజు రోజూ కారులోనే భోజనం చేస్తున్న నికిత ఆ సమయంలో స్టీరింగ్ వీల్ కి ఓ ట్రేను తగిలిస్తుంది ఆ ట్రేని భోజనం చేసేందుకు వీలుగా మార్చుకుంది.