Site icon HashtagU Telugu

Car Bike Accident : బైక్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు.. ఐదుగురి దుర్మరణం

Car Bike Accident in Nalgonda Five Persons Passed away

Car Bike Accident in Nalgonda Five Persons Passed away

ఎదురుగా వస్తోన్న టూ వీలర్ ను కారు(Car) ఢీ కొట్టి పల్టీలు కొట్టగా.. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. నల్గొండ(Nalgonda) జిల్లా చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద ఈ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బైక్ పై ముగ్గురు వెళ్తుండగా.. కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి అక్కంపల్లి వస్తున్న బైక్(Bike) ను కారు ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే మద్దిమడుగు ప్రసాద్ (38), అవినాష్ (12) మృతి చెందారు. బైక్ పై వెళ్తున్న వారిలో మహిళ, కారులో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పట్నపు మణిపాల్ (18) మృతి చెందారు.

మిగతా క్షతగాత్రులను మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద తరలిస్తుండగా దారి మధ్యలో వనం మల్లికార్జున్ (12), మద్దిమడుగు రమణమ్మ (35) మృతి చెందారు. టూ వీలర్ పై వస్తూ ప్రమాదానికి గురై మరణించినవారిని పెద్దఅడిసర్లపల్లి మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. కారులో ఉన్నవారు చింతపల్లి మండలం గుర్రంపల్లికి చెందినవారుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Also Read : Warangal: బైక్‌పై నుంచి పడి మహిళ మృతి