Site icon HashtagU Telugu

Kodali Nani : కొడాని నాని కాన్వాయ్‌కి ప్ర‌మాదం.. దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వెళ్తూ..?

Kodali Nani

Kodali Nani

మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాన్వాయ్‌కి ప్రమాదానికి గురైంది. కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం కుటుంబసమేతంగా కొడాలి నాని ఇంద్ర‌కీలాద్రికి వచ్చారు. దుర్గమ్మ గుడికి వెళ్లేటప్పుడు వినాయకుడి గుడి దగ్గర సిమెంట్ బారికేడ్‌ను కొడాలి నాని కారు ఒక్కసారిగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన కారులోనే కొడాలినానితో పాటు ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. చిన్నప్రమాదం కావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పిందని తెలుస్తోంది. ప్రమాదం అనంతరం అదే కారులోనే గుడికి వెళ్లారని ఆయన అభిమానులు చెబుతున్నారు. తెలుసుకున్నారు