Site icon HashtagU Telugu

Kohli: బ్యాటింగ్ వైఫల్యం పై కోహ్లీ అసహనం

virat kohli

virat kohli

సౌత్ ఆఫ్రికా టూర్ కు ముందు ఈ సారి టీమ్ ఇండియా ఖచ్చితంగా సీరీస్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ అందుకున్న భారత్ సీరీస్ లో ఆధిక్యం సాధించింది. అయితే రెండో టెస్ట్ నుండి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మూడో టెస్ట్ ఓటమితో సీరీస్ కోల్పోయిన భారత్ మరోసారి సఫారీ గడ్డ పై నిరాశ పరిచింది. ఈ నేపద్యంలో జట్టు ఓటమిపై కోహ్లీ స్పందించాడు. బ్యాటింగ్ వైపల్యమే ఓటమికి కారణమని ఒప్పుకున్నాడు. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకొని మూల్యం చెల్లించుకున్నామన్నాడు. తమ బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని విరాట్ అభిప్రాయపడ్డాడు.

బ్యాటింగ్ వైఫల్యం జట్టు మొత్తం అంగీకరించాలని తేల్చేశాడు. బ్యాటింగ్ వైఫల్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్న కోహ్లీ ఈ వైఫల్యం జట్టుకు ఏ మాత్రం మంచిది కాదన్నాడు. ఆస్ట్రేలయా, ఇంగ్లాండ్ పర్యటనల్లో రాణించినంత మాత్రాన సౌత్ ఆఫ్రికా లోనూ బాగా ఆడతాం అన్న గారెంటీ ఇవ్వలేమని విశ్లేషించాడు. బ్యాటింగ్ వైఫల్యం పై ఎవరికి వారే విశ్లేషణ చేసుకోవాలని కోహ్లీ సూచించాడు. ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచిందన్న కోహ్లీ సౌతాఫ్రికాను ఓడిస్తామని అందరూ అంచనా వేసారనీ, అయితే తాము విజయాన్నందుకోలేకపోయామని చెప్పాడు.. ఈ ఓటమిని స్వీకరిస్తూ మరింత మెరుగ్గా కమ్ బ్యాక్ చేస్తామని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌లో సెంచూరియన్ విజయం ప్రత్యేకమన్న భారత్ టెస్ట్ కెప్టెన్ సానుకూల అంశాలు కొన్ని ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

Exit mobile version