Site icon HashtagU Telugu

ప్రభుత్వ అనుమతి లేకుండా ల్యాప్ టాప్ కొనలేరు.. అంతేకాదు ఆ దేశంలో ఎన్నో నిషేధాలు!

Images (6)

Images (6)

ఉత్తర కొరియా ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి ముందుగా కింగ్ జోంగ్ ఉన్ గుర్తుకు వస్తూ ఉంటారు. ఉత్తర కొరియా ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి ముందుగా కింగ్ జోంగ్ ఉన్ గుర్తుకు వస్తూ ఉంటారు. కింగ్ జోంగ్ వ్యవహార శైలి చూడడానికి వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అతని పాలనలో దక్షిణ కొరియాలో అనేక చిత్రవిచిత్రమైన నియమాలు నిబంధనలు అమలు అవుతున్నాయి. అంతేకాకుండా నియంతృత్వానికి కింగ్ జోంగ్ మారుపేరుగా కూడా చెబుతూ ఉంటారు. ఉత్తర కొరియా లో అయితే ఇతని అనుమతి లేకుండా ఆకు కూడా కలదు అంటే అక్కడ వారి నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

అదేవిధంగా మరి ఏ ఇతర దేశంలో లేని రూల్స్ ఈ దేశంలో ఉన్నాయి అని అంటూ ఉంటారు. మరి ఆ దేశంలో ఉన్న కొన్నింటి రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ కొరియా ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ లాప్టాప్ కొనుగోలు చేయరు. కింగ్ జోంగ్ అనుమతి లేకుండా లాప్ టాప్ లను కొనుగోలు చేయడంపై నిషేధం ఉంది. ఉత్తర కొరియా లో లాప్ టాప్ లు చాలా ఖరీదైనవి. కింగ్ జోంగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ కఠినమైన శిక్షలు విధిస్తూ ఉంటారు. అదే విధంగా ఉత్తర కొరియాలోని ప్రజలు బ్లూ జీన్స్ ను ధరించ కూడదు అని అక్కడ ప్రభుత్వం నిషేధించింది.

ఈ రంగు అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని సూచిస్తుంది అని కింగ్ జోంగ్ అభిప్రాయపడ్డారట. ఉత్తర కొరియా ప్రజలు దక్షిణ కొరియా వస్తువులను ఉపయోగించకూడదట. అంతే కాకుండా ఫ్యాషన్,సినిమా సంగీతానికి దూరంగా ఉండాలి అన్న నిబంధనలు కూడా ఉన్నాయట. ఎవరైనా దక్షిణకొరియా వస్తువులను ఉపయోగిస్తే వారికి శిక్ష విధిస్తారు. ఇక్కడ హెయిర్ స్టైల్ విషయంలో కూడా నియమ నిబంధనలు ఉన్నాయట. అక్కడి స్థానికులు ప్రభుత్వం సూచించిన విధంగానే మాత్రమే హెయిర్ స్టైల్నో చేయించుకోవటం. అదేవిధంగా పెళ్లి కాని యువతులు తమ జుట్టును గట్టిగా ఉంచుకోవాలి. అలాగే ఉత్తర కొరియన్లు 28 వెబ్సైట్ లలో మాత్రమే బ్రౌజ్ చేసేందుకు అవకాశం ఉంది. అలాగే ఉత్తర కొరియా లో కేవలం నాలుగు టీవీ ఛానల్ లో మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వం యాజమాన్యంలో ఉన్నాయి.

Exit mobile version