Site icon HashtagU Telugu

Deepika Padukone:15 ఏళ్ల క్రితం నన్నెవరూ నమ్మలేదు.. దీపికా ఎమోషనల్!

Deepika

Deepika

” నేను ఇప్పుడు స్టార్ హీరోయిన్ నే కావచ్చు.. కానీ 15 ఏళ్ల క్రితం కాదు.. అప్పుడు నన్ను, నా నటనను ఎవరూ నమ్మలేదు.. నాలోని కళను గుర్తించే కనీస ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు” అని దీపికా పదుకునే తన గతాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఫ్రాన్స్ లో అట్టహాసంగా జరుగుతున్న 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న దీపిక.. తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో కెరీర్ గ్రాఫ్ గురించి వివరించారు. తొలినాళ్లలో సినిమా అవకాశాల కోసం తాను చేసిన ప్రయత్నాలను.. ఎదురైన చేదు అనుభవాలను పూస గుచ్చినట్టు వివరించారు. ‘

ఎన్నో ఒడిదుడుకులు.. సినిమా ఆఫర్లు.. స్టార్ డమ్.. సక్సెస్ మీట్ లు.. సీన్ కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో న్యాయ నిర్ణేతగా నాకు గొప్ప అవకాశం లభించింది ‘ అని దీపిక చెప్పారు. ‘ ఒక భారతీయురాలిగా నేను ఇక్కడికి వచ్చినందుకు గర్విస్తున్నాను. ఒకప్పుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చాలా తక్కువ సినిమాలే నామినేట్ అయ్యేవి. ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. ఇండియా మూవీ టాలెంట్ వైపు యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది’ అని ఆమె వివరించారు. ఈమేరకు ఆమె కామెంట్స్ తో కూడిన వీడియో ఒకటి ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది.