Site icon HashtagU Telugu

cancer Vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్ తయారుచేసిన రష్యా

Cancer vaccine developed by Russia

Cancer vaccine developed by Russia

cancer Vaccine : ప్రపంచం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్యాన్సర్‌ వ్యాక్సిన్ వచ్చేసింది. రష్యా దీన్ని తయారు చేసింది. ఈ వ్యాధికి తాము సొంతంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసినట్టు రష్యా ప్రకటించింది. “రష్యా సొంతంగా mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది. పేషంట్లకు వీటిని ఫ్రీగా ఇవ్వనుంది. కణతి వృద్ధిని, దాని సమీపంలో మరో కణతి రాకుండా ఇది అణచివేస్తున్నట్టు ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితమైంది” అని TASS తెలిపింది.

ముందుగా తమ దేశ ప్రజలకు ఉచితంగా ఇవ్వబోతున్నట్టు రష్యా ప్రకటించింది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జనవరి 2025 నుంచి రష్యన్ పౌరులకు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ TASS ప్రకారం రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్ ఈ టీకా గురించి చెప్పారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. కేన్సర్‌ను నిరోధించే కొత్త టీకాలు, ఔషధాల అభివృద్ధి ఎంత దూరంలో లేదని తెలిపారు.

మాస్కోలోని గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ గతంలో TASSతో మాట్లాడుతూ..ఈ టీకాను తొలుత కేన్సర్ బాధితుల చికిత్సలో వినియోగించిన తర్వాత.. సాధారణ ప్రజలకు అందజేస్తామని చెప్పారు. అన్ని రకాల కేన్సర్లపై ఇది సమర్దవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఈ వ్యాక్సిన్ కేన్సర్ వ్యాప్తిని నిరోధించగలదని తెలిపారు.

ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఏ క్యాన్సర్‌కు చికిత్స చేస్తుంది. ఎంత ప్రభావవంతంగా ఉంటుంది లేదా వ్యాక్సిన్‌ను ఏమని పిలుస్తారో స్పష్టంగా చెప్పలేదు. క్యాన్సర్‌ పని పట్టేందుకు శాస్త్రీయంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు. చాలా దేశాలు ఈ పరిశోధనల్లో మునిగి ఉన్నాయి. కానీ రష్యా అందరి కంటే ఓ ముందడుగు వేసింది. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో రష్యన్ నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్, గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్‌తో సహా రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

Read Also: Ravichandran Ashwin: అంతర్జాతీయ క్రికెట్ కు అశ్విన్ గుడ్ బై!