Zombie Disease: కెనడాలో భయపెట్టిస్తోన్న ‘జాంబీ’..వ్యాక్సిన్లు, చికిత్సల్లేవ్..!!

నడాలో జింకలను వింత వ్యాధి పీడిస్తోంది. చాలా వేగంగా సంక్రమిస్తోంది. ద క్రానిక్ వేస్టింగ్ డీసీజ్ గా పిలుస్తున్న ఆ వ్యాధి ఇప్పటికే..

  • Written By:
  • Publish Date - April 7, 2022 / 02:58 PM IST

కెనడాలో జింకలను వింత వ్యాధి పీడిస్తోంది. చాలా వేగంగా సంక్రమిస్తోంది. ద క్రానిక్ వేస్టింగ్ డీసీజ్ గా పిలుస్తున్న ఆ వ్యాధి ఇప్పటికే..ఆల్బర్టా, సాస్కాషెవాన్ రాష్ట్రాలకు వ్యాపించినట్లుగా ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. బ్రెయిన్ కు సంబంధించిన ఈ వ్యాధి జింకల జాతుల్లోని దుప్పులు, కస్తూరి జింకలు, మూజ్ వంటి వాటికి సంక్రమిస్తుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు స్పష్టం చేశారు. వాటి నుంచి మనుషులకూ సక్రమిస్తుందని చెబుతున్నారు. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమని..ప్రాణాంతకమని…అది సోకితే ప్రాణాలు గాల్లో కలుస్తాయంటున్నారు. ఈ వ్యాధికి వ్యాక్సిన్లు కానీ, చికిత్స్ కానీ లేదని చెప్పారు.

ఈ వ్యాధిని 1960లోనే అమెరికాలో గుర్తించారు. కొలరాడో, ఓక్లహామా, కాన్సాస్, నెబ్రాస్కా, మినెసోటా, విస్కాన్సిన్, సౌత్ డకోటా, మోంటానాల్లో వ్యాధి విస్తరించింది. ప్రస్తుతం అమెరికాలోని 26 రాష్ట్రాల్లో ఈ వ్యాధి జాడలున్నట్లు తెలిపారు. కెనడాలో 1996లో సాస్కాషెవాన్ లో జింకలో మొదటి కేసు నమోదైంది.

ఈ వ్యాధి మనుషులకు సోకుతుందా..?
అమెరికా సీడీసీ ప్రకారం జింకల నుంచి మనుషులకు సోకుతుంది. చాలా వేగంగా సక్రమించే అవకాశం ఉంది. జింక మాంసం తిన్నా…లేదా దానిని వేటాడినా..ముట్టుకున్నా వ్యాధి అంటుకుంటుందట. ప్రత్యేకంగా జింకల వేటగాళ్లకు ముప్పు ఎక్కువగా ఉంటుందట.

అత్యంత ప్రమాదమా..?
ఈ వ్యాధితో అత్యంత ప్రమాదమని సీడీసీ అంటోంది. ఇన్ఫెక్షన్ సోకిన జింక మాంసంలోని ప్రియాన్ ప్రొటీన్, ఉడికించినా బ్రేక్ డౌన్ కాదు. కాబట్టి మాంసంలో ఆ వైరస్ అలాగే ఉంటుందని చెబుతోంది. సీడబ్ల్యూడీ ఇన్ఫెక్షన్ సోకిన జింకల మాంసాన్ని వండుకుని తిన్నా వ్యాధి సోకుతుందని సీడీసీ హెచ్చరిస్తోంది. అయితే ఇప్పటి వరకు మనుషులకు సోకలేదని అంటోంది.

జాంబీ వ్యాధి అంటే?
జాంబీ అనేది ఒక వ్యాధి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సీడబ్ల్యూసీ సోకిన జింకల మైండ్ అదుపు తప్పుతుందట. ఎక్కువగా సొంగ లేదా జొల్లు కారడం, చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించలేవట. బరువు తగ్గడం, ఎక్కువగా మూత్రం పోయడం, భిన్నమైన ప్రతిస్పందనలు వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. జొల్లు, మూత్రం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.