Anand Mahindra: ఇలా కూడా బట్టలు మడత పెట్టచ్చా… ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన మహీంద్ర

పారిశశ్రామికవేత్త, మహీంద్ర అండ్‌ మహీంద్ర అధినేత ఆనంద్‌ మహీంద్ర ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఇన్నోవేషన్ ఐడియాస్ ఉన్న వ్యక్తులను ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా ఏదైనా కొత్తగా అనిపిస్తే వాటిని సోషల్ మీడియా వేదికగా

Published By: HashtagU Telugu Desk
Anand Mahindra 4 Sixteen Nine

Anand Mahindra 4 Sixteen Nine

Anand Mahindra: పారిశశ్రామికవేత్త, మహీంద్ర అండ్‌ మహీంద్ర అధినేత ఆనంద్‌ మహీంద్ర ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఇన్నోవేషన్ ఐడియాస్ ఉన్న వ్యక్తులను ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా ఏదైనా కొత్తగా అనిపిస్తే వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. అంతేకాకుండా భారత్ గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే.. వెంటనే తనదైన శైలిలో రిప్లై ఇస్తారు.

సాధారణంగా ఇంట్లో బట్టలు ఉతికిన తరువాత మడతపెట్టి బీరువాలోనో, కప్‌బోర్డ్‌లోనే సర్దడం అనేది ఒక పెద్ద టాస్క్‌. అందులోనూ ఏదైనా ఊరికి వెళ్లేటపుడు తక్కువప్లేస్‌లో ఎక్కువ లగేజీ సర్దడం అంటే నిజంగా బిగ్గెస్ట్‌ టాస్క్‌. ఈ విషయానికి సంబంధించిన వీడియోనే ఆనంద్‌ మహీంద్ర తన ఫాలోయర్లతో షేర్‌ చేశారు.

చాలా పొందికగా, అందంగా దుస్తులను మడతపెట్టుతున్న ఈ వీడీయో ఆనం ద్‌ మహీంద్రకు నచ్చేసింది. సాధారణంగా చేసుకునే పనులలో సింపుల్‌ టెక్నిక్స్‌ కొత్త ఇన్నో వేషన్, డిజైన్ నైపుణ్యాలు ఆవిష్కారానికి నాంది పలుకుతాయి. ఈ వీడియో చాలా ఫ్యాసినేటింగా ఉంది అంటూ ప్రశంసలు కురించారు. దశాబ్దాలుగా ప్యాకింగ్‌ల మీద ప్యాకింగ్‌లు చేసుకుంటూ ప్రపంచమంతా కలియదిరుగుతున్న తనకు ముందే ఈ వీడియో ఎందుకు కనిపించలేదంటూ ఫన్నీగా పెట్టారు మహేంద్ర. ఇప్పుడు ఈ వీడియోకు పెద్ద ఎత్తుల లైక్ లు, షేర్లు వస్తున్నాయి.

  Last Updated: 02 Mar 2023, 10:14 PM IST