Site icon HashtagU Telugu

Smoking: ధూమపానం మానకపోతే…..తప్పదు భారీ మూల్యం…!

Smoking And Heart Disease 2x Imresizer

Smoking And Heart Disease 2x Imresizer

Smoking: ఈ మధ్యకాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి. గుండె జబ్బుల బారినపడే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఒక్కప్పుడు…వయస్సు మీద పడే కొద్దీ ఈ సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాతికేళ్ల కుర్రాడు కూడా గుండెపోటుతో శ్వాసవిడిచే ప్రమాదం పొంచి ఉంది. కానీ అతి చిన్న వయస్సులోనే ప్రమాదకరమైన గుండు జబ్బుల బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.

మనదేశంలో 2015లో 6కోట్లా 20లక్షల మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడినవారు. అందులో రెండుకోట్ల…ముప్పై లక్షల మంది 40సంవత్సరాల లోపు ఉన్నవారే. అయితే చిన్న వయస్సులో ఈ ప్రమాదకర రోగాల బారిన పడటానికి అసలు కారణం వారి జీవిన విధానాలేనని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. చెడు ఆహారపు అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడికి, ధూమపానం…ఇవన్నీ కూడా ఈ ప్రమాదాన్ని మరింత పెరిగేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఓ సర్వే ప్రకారం…ధూమపానం చేయని వారితో పోల్చితే…చేసే వారే గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందట. అయితే ధూమపాన అలవాటున్న వ్యక్తి ఒక ఏడాది పాటు…స్మోకింగ్ కు దూరంగా ఉన్నట్లయితే గుండెపోటు వచ్చే ప్రమాదం సగం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే….ప్రతిరోజూ పొగతాగేవారిని ….స్మోకింగ్ చేయని వారితో పోల్చితే…పొగతాగే వారిలో కారోనరి ఆర్ట్రై వ్యాధి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇంకోవిషయం తెలుసా మీకు…కేవలం పొగత్రాగడం వల్లే ప్రపంచ వ్యాప్తంగా పది నుంచి పదిహేను శాతం ప్రజలు గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్నారట. అంతేకాదు పొగతాగడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, కాళ్లల్లో ధమనులు గట్టిగా మారడంతోపాటు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. గుండెకు ఆక్సిజన్ తీసుకుపోయే రక్తనాళాల్లో ఫలకలు, గడ్డలు తయరావడానికి అసలు కారణం కూడా స్మోకింగే. ఈ కారణంతోనే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం పెరిగిపోతుందని కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పొగతాగే అలవాటు ఉన్నవారు…తొందరగా మానుకుంటే చాలా మంచిది.

కాగా గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే…సరైన పోషకాలు అధించడం చాలా అవసరం. సాల్మాన్, మాకెరెల్, ట్యూనా వంటి చేపలు గుండెకు చాలా మంచివి. ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లబించే చేపలు గుండెకు చాలా మేలును చేస్తాయి. అంతేకాదు ఓట్స్ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మన శరీరంలో అధికమొత్తంలో ఉండే కొవ్వును కరిగిస్తాయి.