Site icon HashtagU Telugu

Buttler: బట్లర్ వీర బాదుడు.. ముంబైపై సెంచరీ

Buttler

Buttler

ఐపీఎల్ 15వ సీజన్ లో తొలి సెంచరీ నమోదయింది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌ జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టీ20ల్లో 300వ మ్యాచ్‌ ఆడుతున్న బట్లర్ ముంబయి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. వరుస బౌండరీలు, సిక్సులతో పెను విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలోనే జోష్‌ బట్లర్‌ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 66 బంతుల్లో బట్లర్‌ శతకం బాధగా… అతడి సెంచరీలో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి.

ఇక ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 2022లో టాప్ స్కోరర్‌గా నిలిచిన బట్లర్ తన ఐపీఎల్ కెరీర్ లో మూడో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు… అంతకుముందు ఒక్క ఓవర్‌లో‌నే జోస్ బట్లర్ 26 పరుగులు రాబట్టాడు. బాసిల్ తంపి నాలుగో ఓవర్ వేయగా బట్లర్ ఆ ఓవర్‌లోనే మూడు సిక్సర్లు బాదేశాడు. వరుసగా 4, 6, 6, 4, 6 తో బాసిల్ తంపికి పట్టపగలే చుక్కలు చూపించాడు. ఇక బట్లర్ విజృంభణతో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల న్షటానికి 193 పరుగులు భారీ స్కోరు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా, మిల్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. కిరాన్ పొలార్డ్ ఒక వికెట్ తీశాడు.

Exit mobile version