Hacking: 17 ఏళ్ళ కొడుకు చేతికి ఫోన్ ఇచ్చిన తల్లి.. రూ.లక్షలు మాయం చేసిన యువకుడు?

ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. అమాయకమైన ప్రజలను లోబర్చుకొని అకౌంట్లను హ్యాకింగ్ చేసి భారీ మొత్తంలో డబ్బులు లాగేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 29, 2022 / 09:05 AM IST

ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. అమాయకమైన ప్రజలను లోబర్చుకొని అకౌంట్లను హ్యాకింగ్ చేసి భారీ మొత్తంలో డబ్బులు లాగేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో పెద్ద ఎత్తున మోసపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి గుజరాత్ లో చోటుచేసుకుంది. 17 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రాడు రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడకుండా అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

అనంతరం ఆ కుర్రాడిని విచారించగా అతడు చెబుతున్నది నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయట పెట్టాడు ఆ కుర్రాడు. హ్యాకర్ల బారిన పడి తాను ఇంటి నుంచి పారిపోయి వచ్చానని పోలీసుల ముందు అంగీకరించాడు. గుజరాత్ లోని బరూచ్ కు చెందిన ఒక బిజినెస్ మాన్ కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆ కుర్రవాడు తరచుగా తన తల్లి స్మార్ట్ ఫోన్ లో గేమ్ ఆడుతూఉండేవాడు. ఆలా ఆ కుర్రాడికి డార్క్ వెబ్ డీప్ వెబ్ హ్యాకర్లతో పరిచయం ఏర్పడింది.

అలా ఆ హ్యాకర్లు ఆ కుర్రాడి ఫోను హ్యాక్ చేశారు. అనంతరం ఆ కుర్రాడి తల్లి బ్యాంక్ అకౌంట్ నుంచి దాదాపుగా రూ.4.80 లక్షల రూపాయలను మాయం చేశారు. విషయం తెలుసుకున్న ఆ కుర్రాడు తల్లిదండ్రులు తిడతారేమో అన్న భయంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చేసాడు. అకౌంట్లో డబ్బులు అయిపోవడం కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది. ఈ రెండు పట్టణాల గురించి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తల్లిదండ్రులు చెబుతారేమో అన్న భయంతో ఆ పదిహేనేళ్ల కుర్రాడు గుజరాత్ నుంచి ఏకంగా రాజస్థాన్ లోని అజ్మీర్ వెళ్లిపోయాడు. ఇక్కడ పోలీసులకు యువకుడు మొదట కిడ్నాప్ కథ చెప్పి అనంతరం అంగీకరించాడు. అజ్మీర్ పోలీసులు ఆ కుర్రాన్ని బరూచ్ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత కుర్రాడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.