Site icon HashtagU Telugu

Uttarakhand:ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం…25మంది మృతి..!!

Bus accident

Swiwkwopwazat 202206831620

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది మరణించారని సమాచారం. ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరకాశి, జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిపై దమ్టా దగ్గర ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా నుంచి 40మంది భక్తులతో బస్సు యమునోత్రి వెళ్తుండగా లోయలో పడింది. ప్రమాద సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది…ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి రూ.50వేల సాయం అందిస్తామని ప్రకటించారు.

Exit mobile version