Site icon HashtagU Telugu

Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident

Road Accident

Road Accident: హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం స్థానికుల వాంగ్మూలం జతచేసి కేసు నమోదు చేశారు. వివరాలలోకి వెళితే..

నార్కట్‌పల్లి మండలం లొంగోటం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఆర్‌టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఏ ప్రమాద ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు.

బీహెచ్‌ఈఎల్‌ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌కు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. గాయపడిన ఎనిమిది మంది ప్రయాణికుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు.

Also Read: History Will Judge : చరిత్రే తీర్పు చెబుతుంది.. ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ఐరాస చీఫ్ వ్యాఖ్య