Bus Accident : ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బ‌స్సు.. ఒక‌రు మృతి

విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బ‌స్సు అదుపుత‌ప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక విద్యార్థి మృతి చెందగా, ఒక మహిళ

Published By: HashtagU Telugu Desk
Mexico Bus Crash

Road accident

విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బ‌స్సు అదుపుత‌ప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక విద్యార్థి మృతి చెందగా, ఒక మహిళ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఏపీఎస్‌ ఆర్‌టీసీ డ్రైవర్ వాహనం నడుపుతుండగా స్పృహతప్పి పడిపోవ‌డంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సు అదుపుతప్పి 7వ తరగతి విద్యార్థిని ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఆ తర్వాత వాహనం ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

  Last Updated: 21 Nov 2022, 11:54 AM IST