నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మిర్యాలగూడ వద్ద నందిపాడు బైపాస్ రోడ్డులో శనివారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3.30 గంటలకు హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు మిర్యాలగూడ వద్ద బోల్తా పడటంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 28 మంది ప్రయాణికులతో అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
Nalgonda: బస్సుబోల్తా – ఎనిమిది మందికి గాయాలు

Bike Accident