Bashirbagh: ప్రభుత్వం మారిన తరువాత మాజీ మంత్రుల కార్యాలయాల్లో ఫైల్స్ మాయం కావడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బషీర్‌బాగ్ (Bashirbagh) విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో చోరీకి యత్నించారు. ఆటోలో ఫైల్స్‌ను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. ఇదే కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ ఉన్నది. ఆటోలో ఫైల్స్ తరలించడాన్ని అధికారులు గమనించిన అడ్డుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో అధికారులను చూసి ఆగంతకులు ఫైల్స్‌తో ఉన్న ఆటోను వదిలిపోయారు. సబిత ఛాంబర్ నుంచి ఫైల్స్ ఏమైనా చోరీ చేయాలని చూశారా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.