Bumrah: బూమ్రా,షమీ పేస్‌ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు దుమ్మురేపారు. బూమ్రా, షమీ నిప్పులు చెరిగే బంతులతో

  • Written By:
  • Publish Date - July 12, 2022 / 10:05 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు దుమ్మురేపారు. బూమ్రా, షమీ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిన వేళ ఇంగ్లాండ్ 110 పరుగులకే కుప్పకూలింది. పరిమిత ఓవర్ల ఫార్మేట్‌లో తన ఫామ్ కొనసాగిస్తున్న బూమ్రా తొలి ఓవర్ నుంచే ఇంగ్లాండ్ బ్యాటర్లను హడలెత్తించాడు. బూమ్రా ధాటికి జాసన్ రాయ్, బెయిర్‌ స్టో, రూట్‌ ఇలా వచ్చి అలా వెళ్ళారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ రెండో ఓవర్‌ నుంచే వికెట్లు పారేసుకుంది. బుమ్రా చెలరేగి బౌలింగ్‌ చేయడంతో ఆ టీమ్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లో 6 పరుగుల దగ్గర ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ వికెట్‌ కోల్పోయిన ఇంగ్లీష్ టీమ్ ఏ దశలోనూ కోలుకోలేదు.

అటు షమీ కూడా చెలరేగడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఒక దశలో 68 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు 100 దాటడం కష్టమనిపించింది. డేవిడ్ విల్లీ 21 రన్స్ చేయడంతో స్కోర్ 100 దాటగలిగింది. ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన బూమ్రా 19 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. షమీ 3 వికెట్లు తీసుకున్నాడు. ముఖ్యంగా బుమ్రా దెబ్బకు ఆ టీమ్‌లో నలుగురు స్టార్‌ బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. ఇండియాపై వన్డేల్లో ఇంగ్లాండ్‌కు ఇదే అతి తక్కువ స్కోరు.

కాగా కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేసిన బూమ్రా అరుదైన రికార్డ్ సాధించాడు. భారత్ తరపున వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మూడో బౌలర్‌గా నిలిచాడు. గతంలో స్టువర్ట్ బిన్నీ 2014లో కేవలం 4 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉండగా.. అనిల్ కుంబ్లే 1993లో విండీస్‌పై 12 రన్స్‌కు 6 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌పై బూమ్రా 19 పరుగులకు 6 వికెట్లతో వారి తర్వాతి స్థానంలో నిలిచాడు.