Site icon HashtagU Telugu

Bumrah: వెన్ను శస్త్రచికిత్స కోసం న్యూజిలాండ్ కు బుమ్రా!

Jasprit Bumrah

Jasprit Bumrah

భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆయన వెన్ను శస్త్రచికిత్స చేయించుకోవడానికి న్యూజిలాండ్ కు వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. గత ఐదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రాను శస్త్ర చికిత్స కోసం ఆక్లాండ్‌కు తీసుకెళ్లేందుకు  ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ గ్రాహం ట్రీట్ మెంట్ ఇచ్చే అవకాశాలున్నాయి. అతను షేన్ బాండ్‌తో సహా కొంతమంది న్యూజిలాండ్ ఆటగాళ్లకు ఆపరేషన్ చేశాడు.

ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్‌కు శస్త్రచికిత్స చేయడంలో స్కౌటెన్ ఇంగ్లిస్‌కు సహాయం చేశాడు. వెన్ను సమస్యలతో బాధపడుతున్న బెన్ ద్వార్షుయిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌లకు కూడా శస్త్రచికిత్సలు చేశాడు. బుమ్రా కోలుకునే సమయం 20 నుంచి 24 వారాల మధ్య ఉంది. అంటే అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023, లండన్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌ మ్యాచ్ లకు దూరంగా ఉంటాడు. అయితే అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న ప్రపంచకప్‌కు బుమ్రాను సిద్ధం చేయడం కోసం బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది.