Asia Cup 2023: భారత్ నేపాల్ మ్యాచ్ కి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనూహ్యంగా జస్ప్రీత్ బుమ్రా ఇండియాకి తిరిగి వచ్చాడు. బుమ్రా కొలంబో నుంచి ముంబైకి ఎందుకు పంపించారనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ. ప్రస్తుతం వ్యక్తిగత కారణాలను చెబుతున్నారు. బుమ్రా ఆదివారం రాత్రి కొలంబో నుంచి ముంబైకి బయలుదేరాడు.
ఆసియా కప్ 2023 ఐదవ మ్యాచ్‌లో భారత్ నేపాల్‌తో తలపడనుంది . సూపర్-4లోకి అడుగు పెట్టాలంటే ఇరు జట్లకు విజయం చాలా ముఖ్యం. పాకిస్థాన్‌తో ఆడిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా టీమిండియా ఓడిపోయింది. అదే సమయంలో నేపాల్ తన తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ రోజు సెప్టెంబర్ 4న భారత్, నేపాల్ తలపడనున్నాయి. అయితే ఈ కీలక మ్యాచ్ ముందు భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్వదేశానికి వచ్చాడు. ఈ మధ్యే బుమ్రా క్రికెట్‌లో పునరాగమనం చేశాడు.బుమ్రా గైర్హాజరీలో షమీ పేస్ అటాక్‌కు నాయకత్వం వహించగలడు.
Also Read: Head Massage: హెడ్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?