IT Employee Offers: ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు.. శాలరీతో పాటు బీఎండబ్ల్యూ బైక్‌లు

టెక్నాలజీకి తగ్గట్లు టెక్కీలు నాలెడ్జ్, స్కిల్‌ను పెంచుకుంటూ ఉండాలి. అప్పుడే సాంకేతిక రంగంలో ఎక్కువ కాలం రాణించగలరు. టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రోజురోజుకు వేగంగా మార్పులు వస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 05 07 At 21.31.55

Whatsapp Image 2023 05 07 At 21.31.55

IT Employee Offers: టెక్నాలజీకి తగ్గట్లు టెక్కీలు నాలెడ్జ్, స్కిల్‌ను పెంచుకుంటూ ఉండాలి. అప్పుడే సాంకేతిక రంగంలో ఎక్కువ కాలం రాణించగలరు. టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రోజురోజుకు వేగంగా మార్పులు వస్తున్నారు. రోజుకో కొత్త టెక్నాలజీ మార్కెట్ లోకి వస్తుంది. దీంతో టెక్కీలు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికకు తగ్గట్లు నాలెడ్జ్ ను పెంచుకుంటూ ఉండాలి. లేకపోతే ఎక్కువకాలం ఉండలేరు.

ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెను మార్పులకు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచలోనే ఇదొక సంచలనంగా మారిపోయిది. చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్లు వచ్చిన తర్వాత అనేక మార్పులు వస్తోన్నాయి. ఈ క్రమంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నైపుణ్య ఉన్నవారికి టెక్ కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. వీరికి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. డబుల్ శాలరీ ఆఫర్ చేయడంతో పాటు అనేక సదుపాయాలు కల్పిస్తున్నాయి.

ఏఐ అనుభవం ఉన్న వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తుంటే.. మరో కంపెనీలో చేరేలనుకుంటే భారీ ప్యాకేజటీ ప్రకటిస్తున్నాయి. 30 శాతం నుంచి 50 శాతం వరకు అదనందగా చెల్లించేందుకు ముందుకొస్తున్నాయి. శాలరీతో పాటు బైక్ లను కూడా ఉచితంగా అందించే కొన్ని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫ్లెక్సికార్ అనే స్టార్టప్ కంపెనీ బెంగళూరులో డైటా సైన్స్ హబ్ లో కంప్యూటర్ విజన్ స్పెషలిస్టులు, ఇంజినీర్ల టీంకు ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుంది.

ఈ కంపెనీ విచిత్రమైన ఆఫర్లు ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్ ను ఇచ్చేందుకు ముందుకొచ్చింది.ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్స్ కు బాగా డిమాండ్ ఏర్పడింది. ఇటు ఇండియాలో కూడా ఏఐ ఉద్యోగులు దొరకడం లేదు. డిమాండ్ భారీగా ఉన్న కారణంగా భారీ ప్యాకేజీలను కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి.

  Last Updated: 07 May 2023, 09:32 PM IST