Viral Video: పులిని పరుగులు పెట్టించిన ఎద్దు.. ఆ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!

సాధారణంగా అడవి అనగానే మనకు ముఖ్యంగా పులి, సింహం ఈ రెండు భయంకరమైన జంతువులు గుర్తుకు వస్తాయి.

  • Written By:
  • Publish Date - September 2, 2022 / 07:12 AM IST

సాధారణంగా అడవి అనగానే మనకు ముఖ్యంగా పులి, సింహం ఈ రెండు భయంకరమైన జంతువులు గుర్తుకు వస్తాయి. అడవిలోని జంతువులు ఏవైనా కూడా ఈ పులి సింహం కంటపడటానికి ఇష్టపడవు. పొరపాటున ఈ రెండు జంతువుల కంటపడ్డాయి అంటే అవి వేటాడి వేటాడి మరీ చంపేస్తాయి. ఈ క్రమంలోని కొన్ని జంతువులు వాటి ప్రాణాలను రక్షించుకోవడం కోసం పులులు సింహాల తో పోట్లాడుతూ ఉంటాయి.

కొన్ని సందర్భాలలో మాత్రమే ఈ పులి సింహం జంతువులు ఓడిపోతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక ఎద్దు రోడ్డుపై పరిగెడుతూ వెళ్తుంది. రోడ్డు పక్కన ఉన్న పులి ఆ ఎద్దు మీదకు దాడి చేయడానికి వెళ్ళింది. ఆ పులిని చూసిన ఎద్దు ఏమాత్రం భయపడకుండా ఒక అడుగు ముందుకు వేసి పులిని కొమ్మలతో పొడిచడానికి వెళ్ళింది. దాంతో భయపడి పోయిన పులి వెనకడుగు వేసి పక్కకు పారిపోయింది.

 

ఆ ఎద్దు అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత పులి దాని దారిన అది వెళ్లిపోయింది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఆ వీడియో తీసే వారికి జాగ్రత్తలు చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.