Site icon HashtagU Telugu

BSP : బీసీ రిజ‌ర్వేష‌న్లపై రేప‌టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు బీఎస్పీ పిలుపు

Rs Praveen Kumar

Rs Praveen Kumar

బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నిరసనలు చేపడుతుందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రేప‌టి (నవంబర్ 26) నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని.. తమ నిరసనలో భాగంగా సంతకాల సేక‌ర‌ణ చేసి రాష్ట్రపతికి పంపిస్తామ‌న్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసన తెలుపుతామని తెలిపారు. మొత్తం జనాభా 52 శాతంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి కేవలం 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు లభిస్తున్నాయని ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ తెలిపారు. 52 శాతం జనాభాకు ఇంత తక్కువ శాతం రిజర్వేషన్లు ఎలా సరిపోతాయని ఆయ‌న ప్రశ్నించారు.