Soundarya Neeraj : కర్ణాటక మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం…

కర్ణాటక మాజీ సీఎం బీఎస్​ యడియూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Yedyurappa Gd

Yedyurappa Gd

కర్ణాటక మాజీ సీఎం బీఎస్​ యడియూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మనుమరాలు సౌందర్య(30) అనుమానాస్పద స్థితిలో బెంగళూరు వసంత నగరలోని తన ఇంట్లో మృతదేహమై కనిపించింది. అయితే.. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.యడియూరప్ప కుమార్తె అయిన పద్మావతి కూతురు సౌందర్య. ఆమె కుటుంబ కలహాలతో గత కొంతకాలంగా ఫుల్ డిప్రెషన్​లో ఉన్నట్లు సమాచారం. సౌందర్య ఒక డాక్టర్. ఈమె 2018లో డా. నీరజ్​ను వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప. బెంగళూరులోని హైగ్రౌండ్స్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ అపార్ట్​మెంట్​లో సౌందర్య ఉరి వేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. పోస్ట్​మార్టం నిమిత్తం సౌందర్య డెడ్ బాడీ ని బౌరింగ్​ ఆస్పత్రికి తరలించారు.

  Last Updated: 28 Jan 2022, 03:51 PM IST