Site icon HashtagU Telugu

Nellore Murder: నెల్లూరులో దంపతుల దారుణ హత్య

USA

USA

నెల్లూరులోని విద్యుత్ శాఖా కార్యాలయం వద్ద శ్రీరామ క్యాంటీన్ అధినేత వాసిరెడ్డి కృష్ణారావు దంపతులను కొందరు దుండగులు నిన్నరాత్రి దారుణంగా హత్యచేసి, వారి ఇంట్లో విలువైన ఆభరణాలు దోచుకువెళ్లారు. మినీ బైపాస్ రోడ్డు సమీపంలోని కన్వెన్షన్ హాల్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. తొలుత కృష్ణారావు భార్య సునీత గొంతు కోసి హత్య చేశారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన కృష్ణారావుపై దాడి చేసి హత్యచేశారు. అనంతరం ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలను తీసుకుని వెళ్లిపోయారు. పోలీసులు దంపతుల మృతదేహాలను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.