Site icon HashtagU Telugu

CSK vs RCB:చెన్నైకి తొలి విజయం దక్కేనా ?

Dhoni Kohli Imresizer

Dhoni Kohli Imresizer

ఐపీఎల్‌ లో ఇవాళ 22వ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీపడనున్నాయి. మహారాష్ట్రలోని డీవై పాటిల్ మైదానం వేదికగా ఏప్రిల్ 12న సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో తో తాము ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో గెలిచి జోరుమీదుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ తాను ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
ఇక ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హెడ్ టుహెడ్ రికార్డుల ను పరిశీలిస్తే.. ఈ మెగా టోర్నీలో రెండు జట్లు మొత్తం 28 మ్యాచ్‌ల్లో తలపడగా చెన్నై 18 మ్యాచుల్లో, బెంగళూరు 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒకదాంట్లో ఫలితం రాలేదు.

ఇక ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పోలిస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌ విభాగాల్లో బలంగా ఉందనే చెప్పాలి. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లో చిన్నచిన్న పోరపాట్లు మినహా ఆర్సీబీ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని చెప్పొచ్చు… ఇక బెంగళూరు జట్టు కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్ తొలి 4 మ్యాచుల్లో తనకున్న వనరులను చక్కగా ఉపయోగించుకోగా, యువ ఓపెనర్ అనూజ్ రావత్, దినేష్ కార్తీక్, విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉండడం ఆర్సీబీకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక బ్యాటింగ్‌లో డుప్లెసిస్, అనుజ్ రావాత్ , విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీ, మ్యాక్స్ వెల్ .. బౌలింగ్‌లో హసరంగా, జోష్ హాజిల్‌వుడ్,ఆకాష్ దీప్,మహ్మద్ సిరాజ్ మంచి టచ్‌లో ఉండటం బెంగళూరు జట్టుకు శుభపరిణామమని చెప్పాలి..
వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైన చెన్నై జట్టు దారుణమైన రన్‌రేటు మైనస్ 1.211 తో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. గత సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ వరుసగా విఫలం కావడం, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ , అంబటి రాయుడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అన్ని విభాగాల్లో నూదారుణ ప్రదర్శన కనబరుస్తున్న చెన్నైపై అభిమానులు మండిపడుతున్నారు. అయితే, పడిలేచిన కెరటంలా ఒక్కసారిగా ఎగిసిపడటం చెన్నై సూపర్ కింగ్స్ కి అలవాటే ఈ క్రమంలో ఆ జట్టును అస్సలు తక్కువగా అంచనా వేయలేము.