Site icon HashtagU Telugu

Sangareddy: బీఆర్ఎస్ కార్యకర్తను కొట్టి చంపిన కాంగ్రెస్ కార్యకర్తలు

Sangareddy

Sangareddy

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. దీంతో స్థానిక ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలలోకి వెళితే..

సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం సింగరబొగుడ తండాలో బీఆర్‌ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ కార్యకర్తలు దారుణంగా దాడి చేసి కొట్టి చంపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా యంత్రాంగం రూ.5 లక్షల సిసి రోడ్డు పనులను గతంలో ఆమోదం పొందిన ప్రదేశంలో కాకుండా ఇతర ప్రాంతానికి తరలించడంతో వివాదం చెలరేగింది.

We’re now on WhatsApp : Click to Join

ప్రతిపాదిత రోడ్డును కొత్త ప్రదేశానికి మార్చడంతో ఆందోళనకు గురైన బీఆర్‌ఎస్ కార్యకర్త శ్రీను నాయక్ (25) స్థానిక కాంగ్రెస్ నాయకులను కలిశాడు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో శ్రీని నాయక్‌ను కొట్టారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే నిందితులు గ్రామం వదిలి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల్ని వదిలిపెట్టేది లేదని గ్రామస్థులు అంటున్నారు. పోలీసులు జాప్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని గ్రామస్థులు హెచ్చరించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: Chiranjeevi : జనసేనకు ఓపెన్‌గా మద్దతు ఇచ్చిన చిరంజీవి.. వీళ్లకు సపోర్ట్ చేయండి అంటూ..