Site icon HashtagU Telugu

AP BRS: ఏపీలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర

Brs Ap

Brs Ap

AP BRS: రానున్న ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి కీలక భూమిక పోషించనుందని ఆ పార్టీ నాయకులు షేక్ ఖాజావలి అన్నారు. సోమవారం మంగళగిరి రోడ్ లోని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయంలో పలువురు నాయకులు భారాసాలో చేరారు. ఈ సందర్భంగా ఖాజావలి మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయి ప్రజా జీవనం అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఐఏఎస్ అధికారి,బి ఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ కు అన్ని వర్గాల ప్రజల సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన ఉందన్నారు.ఆయన పరిపాలన దక్షతతోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.బి ఆర్ ఎస్ బలోపేతంలో ప్రజలు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.తొలుత ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకులు కలువ పూర్ణచంద్రరావు మరియు మహిళా నాయకురాలు షేక్ ఫాతిమా పఠాన్ గుల్జార్ షేక్ మహబూబ్ ఉన్నిసా షేక్ రిజ్వానాలు భారత రాష్ట్ర సమితి లో చేరారు.