తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)లను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ పార్టీ చర్యలకు దిగింది. వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వారు గత కొంత కాలంగా పార్టీకి వ్యతిరేకంగా పని చేయడమే కాకుండా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల వీరు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.