BRS : బీఆర్‌ఎస్ సీనియర్ నేత హ‌రీశ్వ‌ర్‌రెడ్డి క‌న్నుమూత‌.. సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌

బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ డిప్యూటీ స్పీక‌ర్ కొప్పుల హ‌రీశ్వ‌ర్ రెడ్డి క‌న్నుమూశారు. గత కొంతకాలంగా

Published By: HashtagU Telugu Desk
Harishwar Reddy

Harishwar Reddy

బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ డిప్యూటీ స్పీక‌ర్ కొప్పుల హ‌రీశ్వ‌ర్ రెడ్డి క‌న్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయ‌న‌ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గతంలో ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా ఆయ‌న పనిచేశారు. ఆయన తనయుడు మహేశ్‌రెడ్డి పరిగి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమం ఉధృతమైన సమయంలో హరీశ్వర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్వర్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. హరీశ్వర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేసీఆర్, పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. హరీశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  Last Updated: 23 Sep 2023, 08:35 AM IST