Hyderbad: బీఅర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి రోడ్ షో మీద షూ విసిరింది బాబా ఫసియుద్దిన్ అంటూ బోరబండ పోలీసులకు బీ అర్ ఎస్ నేతల ఫిర్యాదు చేశారు. బోర బండ లో ఈనెల 9 న ఎమ్మెల్యే మాగంటి రోడ్ షో మీద షూ దాడి ఘటన జరిగిందని, కార్పొరేటర్ బాబా ఫసియుద్దున్ తదితరుల మీద చర్యలు తీసుకోవాలి అని బోర బండ పోలీసులతో పాటు నగర పోలీస్ కమిషనర్ కు బీ అర్ ఎస్ నాయకుల ఫిర్యాదు.
ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను, వీడియోలను పోలీసులకు బీఅర్ఎస్ నేతలు అందించారు. షూ స్వాదీనం చేసుకున్న పోలీసులు.. ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బాబా ఫసియుద్దిన్ మొదట్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ గా గెలిచి డిప్యూటి మేయర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామల వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.