Site icon HashtagU Telugu

BRS MP: బీఆర్ఎస్ బలంగా ఉంది, కేసులకు భయపడొద్దు!

Nomination Of Vaddiraju Ravichandra As Brs Rajya Sabha Candidate

Nomination Of Vaddiraju Ravichandra As Brs Rajya Sabha Candidate

BRS MP: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు తదితర ప్రముఖులతో కలిసి నిర్వహించిన పార్టీ మీటింగుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారం కోల్పోయినప్పటికీ బీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీ అని, అధైర్యపడవద్దని తాము కొండంత అండగా ఉంటామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు కార్యకర్తలకు భరోసానిచ్చారు. అధికార పార్టీ నాయకులు పెట్టే కేసులకు భయపడవద్దని, తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుదామన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఆదివారం జరిగిన ముఖ్య నాయకులు,కార్యకర్తల సమావేశానికి ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ,మనమందరం కూడా మళ్లీ మళ్లీ కలుసుకుందామని, మరింత కష్టపడి పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావును గతంలో కన్నా కూడా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందామన్నారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ ప్రముఖులు పూలదాసు కృష్ణమూర్తి,బానోతు నీల్లా,భూక్యా కళావతి,ఎలంకి సత్యనారాయణ,లకావత్ గిరిబాబు,చావా వెంకట రామారావు తదితరులు హాజరై ప్రసంగించారు.