BRS MLCs : శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష 58 వేల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రూ.2,500 ఇచ్చారు?ఎంతమంది వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇచ్చారు? ఎంత మందికి తులం బంగారం ఇచ్చారు అని నిలదీశారు.

Published By: HashtagU Telugu Desk
BRS MLCs protest in the Legislative Council premises

BRS MLCs protest in the Legislative Council premises

BRS MLCs : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన తెలిపారు. రోజుకో అంశంపై నిరనస వ్యక్తం చేస్తున్న గులాబీ పార్టీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇవాళ శాసనమండలి ఆవరణంలో ఎమ్మెల్సీ కవితతో పాటు నిరసన తెలియజేశారు. ‘అప్పులు ఘనం అభివృద్ధి శూన్యం’ అంటూ ప్లకార్డులు పట్టుకుని అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు చేశారు. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష 58 వేల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రూ.2,500 ఇచ్చారు?ఎంతమంది వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇచ్చారు? ఎంత మందికి తులం బంగారం ఇచ్చారు అని నిలదీశారు.

Read Also: Gautham Ghattamaneni: యాక్టింగ్‌‌తో మెప్పించిన మహేశ్‌‌బాబు కుమారుడు గౌతమ్

15 నెలల్లో రూ.1.58 లక్షల కోట్లు అప్పుచేసినా అభిమాత్రం సున్నా అని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తూతూ మంత్రంగా సభను నడిపిస్తున్నరని, పనిగంటలు తగ్గించారన్నారు. సభలో చర్చించే అవకాశం లేకున్నా ప్రజా క్షేత్రంలో పోరాడుతామని స్పష్టం చేశారు. సభలో ప్రజల సమస్యలు చర్చించడం లేదని, కేవలం బిల్లులు ప్రవేశపెట్టడం పాస్ చేయించుకోవడమే జరుగుతున్నదని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల వల్ల ప్రజల సమస్యలు సభ దృష్టికి వచ్చేవన్నారు.

ఇది సభను, ప్రజలను తప్పు పట్టించడమేమనని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి అప్పుకు కరెక్ట్ లెక్కలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌పై ఈ రోజు ప్రభుత్వం చేసిన అప్పులను ఎండగడుతామన్నారు. 15 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష 58 వేల కోట్ల అప్పు చేశామని చెబుతున్నారని, 9 ఏంళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 4 లక్షల 17 వేల కోట్లు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రేవంత్ రెడ్డి 15 నెలల్లోనే లక్ష 58 వేల కోట్ల అప్పు చేశారని, పదే పదే ప్రజల్లో కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Read Also: PM Modi : ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు.. ఖర్చు వివరాలు వెల్లడి

 

 

 

  Last Updated: 21 Mar 2025, 02:19 PM IST