MLC Kavitha: ధాన్యపు రాశుల తెలంగాణ.. వీడియో చిత్రీకరించిన కవిత

  • Written By:
  • Updated On - November 18, 2023 / 11:45 AM IST

MLC Kavitha: ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినా తెలంగాణ వరి ధాన్యంతో కళకళాలాడుతున్న విషయం తెలిసిందే. ఇతర పంటలతో పోలిస్తే ఎక్కువగా వరి సాగవుతోంది తెలంగాణలో. దేశంలోనే అత్యధిక వరి పండిస్తున్న రాష్ట్రంగా పేరుగాంచింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ వీడియోను తీశారు. ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా వీడియోను చిత్రీకరించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత “ఎక్స్” లో ఆసక్తికర వీడియోని పోస్ట్ చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా తాను స్వయంగా వీడియోను చిత్రీకరించారు. ఎన్నికల ప్రచారానికి గాను నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఆర్మూర్ లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టిన దాన్ని వీడియోలో ఆమె చిత్రీకరించారు. “ధాన్యపు రాశుల తెలంగాణ. అప్పుడు ఎట్లుంది తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!” అని పోస్టులో కవిత పేర్కొన్నారు.