Site icon HashtagU Telugu

Kavitha : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కవిత..బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనస్వాగతం

brs-mlc-kavitha-reached-shamshabad-airport

brs-mlc-kavitha-reached-shamshabad-airport

Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. తన భర్త అనిల్, కుమారుడు, సోదరుడు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కవిత శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. శంషాబాద్ చేరుకున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దాదాపు ఐదు నెలల తరువాత కవిత హైదరాబాద్ కు వచ్చారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ లోని తన నివాసానికి భర్తతో పాటు కవిత, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు బయలుదేరారు.

We’re now on WhatsApp. Click to Join.

కవిత రాక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్ట్ మార్గంలో ఘన స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బెయిర్ రావడంతో కవిత 165 రోజుల తరువాత హైదరాబాద్ కు తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బంజారాహిల్స్ నివాసానికి 500 కార్ల‌తో భారీ ర్యాలీగా బయలుదేరనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఆర్డర్ అందిన తరువాత, పూచీకత్తు సమర్పించిన అనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు.

Read Also: Skill University : ఏపీలో నైపుణ్య విశ్వవిద్యాలయం అంటే ఏమిటి.?

కాగా.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా, ఏప్రిల్ 15న సీబీఐ అరెస్టు చేసింది. అప్పట్నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉంటున్నారు. ఈ ఐదు నెలల్లో అనేక పరిణామాల అనంతరం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. కవిత బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. కవిత భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పూచీకత్తు సమర్పించారు.

దాంతో ఆమె విడుదలను అంగీకరిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీహార్ జైలుకు వారెంట్ ఇచ్చింది. ట్రయల్‌ కోర్టు రిలీజ్‌ వారెంట్‌ ఇవ్వడంతో 164 రోజులుగా జైలులో ఉన్న కవిత జైలు నుంచి బయటికి వచ్చారు. అయితే మంగళవారం రాత్రి 9 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ఐదు నెలలు తర్వాత బయటకు రావడంతో భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, కుమారుడిని చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆమె విడుదల సందర్భంగా జైలు వద్దకు మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకున్నారు.

Read Also: Mohan Bhagwat : ఆర్‌ఎస్‌ఎస్‌ ఛీప్‌ మోహన్‌ భగవత్‌కు భద్రత పెంపు