MLC Kavitha: ఆదివారం ఓట్ల లెక్కింపుకు సంబంధించి రౌండ్ల వారీ అప్‌డేట్‌ల కోసం ప్రతి పార్టీ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు బయలు దేరారు.
ఆమె బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఓటింగ్ సరళిపై, ఫలితాల గురించి చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రగతి భవన్ కు బయలు దేరేముందు మీడియాతో మాట్లాడుతూ మంచి జరుగుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమై 9.30 గంటలకు తొలి రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.